జేఈఈ నకిలీ హాల్ టికెట్లు కలకలం.. విద్యార్థులు ఆందోళన

జేఈఈ నకిలీ హాల్ టికెట్లు కలకలం.. విద్యార్థులు ఆందోళన

GNTR: జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. చంద్రమౌళి నగర్‌లోని ఆక్స్‌ఫర్డ్ కాలేజీలో JEE మెయిన్స్ పరీక్షకు సంబంధించి ఇవాళ నకిలీ హాల్ టికెట్లు బయటపడ్డాయి. పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్లు ఫేక్ అని గుర్తించిన అధికారులు, విద్యార్థులను పరీక్షకు అనుమతించకుండా వెనక్కి పంపించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు.