పేరుపాలెం బీచ్‌లో పర్యాటకుల సందడి

పేరుపాలెం బీచ్‌లో పర్యాటకుల సందడి

W.G: కార్తీక మాసం ఆదివారం కావడంతో ప్రముఖ పర్యాటక కేంద్రం మొగల్తూరు పేరుపాలెం బీచ్‌కు జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు పోటెత్తారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ప్రజలు సముద్ర స్నానాలు చేసి, ఇసుక తిన్నెలపై సరదాగా గడిపారు. తీరాన పలువురు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.