కుక్కల పర్యవేక్షణ బాధ్యతలు.. ఖండించిన ఉపాధ్యాయులు

కుక్కల పర్యవేక్షణ బాధ్యతలు.. ఖండించిన ఉపాధ్యాయులు

పాఠశాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని వీధి కుక్కలను పర్యవేక్షించాలంటూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉపాధ్యాయులు ఖండించారు. ఇప్పటికే ఎన్నికల విధులు, సర్వేలు, ఇతర బాధ్యతలతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. వీటికి అదనంగా కుక్కల బాధ్యతను అప్పగించటం అన్యాయమన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.