బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్‌కు వినతి

బస్సు సౌకర్యం కల్పించాలని డిపో మేనేజర్‌కు వినతి

BHNG: ముస్తాలపల్లి - చీమలకొండూరు గ్రామాలకు బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని నల్లమాస రాజు గౌడ్ యాదగిరిగుట్ట డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. 2007 నుంచి గత సంవత్సరం వరకు బస్సు సర్వీసు నడిచిందని, సాంకేతిక కారణాల వల్ల అది నిలిచిపోయిందని ఆయన తెలిపారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. వెంటనే బస్సు సదుపాయాన్ని కల్పించాలని కోరారు.