ఎగిసిపడుతున్న చెక్ డ్యామ్

ADB: తాంసి మండలం హస్నాపూర్ గ్రామ శివారులోని చెక్ డ్యామ్‌పై నుంచి వరదనీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగు నిండిపోవడంతో, అలల వలె ఎగిసిపడుతున్న నీటి ప్రవాహం ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరిస్తోంది. ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు గ్రామస్థులు, చుట్టుపక్కల ప్రాంతాల వారు చెక్ డ్యామ్ వద్దకు చేరుకుంటున్నారు.