VIDEO: 'బకాయి వేతనాలు చెల్లించాలని ఆందోళన'
SKLM: శ్రీకాకుళం రిమ్స్ అధికారులు స్పందించి సెక్యూరిటీ సిబ్బందికి రెండు నెలల వేతనం బకాయిలు తక్షణం చెల్లించాలని సీఐటీయు టౌన్ కన్వీనర్ ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. రిమ్స్ ఆసుపత్రి ముందు సోమవారం ఉదయం రిమ్స్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ధర్నా నిర్వహించింది. వేతనాలు సకాలంలో చెల్లించకపోతే భవిష్యత్తులో ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది.