VIDEO: ఆందోళన నిర్వహించిన బీజేపీ నాయకులు
MNCL: లక్షెట్టిపేట పట్టణంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ మధ్యాహ్నం పట్టణంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. దేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.