అధికారుల నిర్లక్ష్యం.. దివ్యాంగుల ఇక్కట్లు

అధికారుల నిర్లక్ష్యం.. దివ్యాంగుల ఇక్కట్లు

NGKL: నేడు కలెక్టరేట్‌లో జరగాల్సిన దివ్యాంగుల సంఘాల సమావేశాన్ని అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాయిదా వేశారు. దీంతో దూర ప్రాంతాల నుంచి కష్టపడి వచ్చిన తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఎన్పీఆర్డీ దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కుర్మయ్య కలెక్టర్‌ను కోరారు. సమాచారం ఇవ్వకపోవడంపై ప్రశ్నిస్తే అధికారులు వింత సమాధానాలు చెప్పారని ఆరోపించారు.