ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయని జనరేటర్లు
SRPT: విద్యుత్ కోతల సమయంలో పనులకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం మోతే తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు అందించిన జనరేటర్లు నిరుపయోగంగా మారాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అప్పగించిన తర్వాత, అధికార యంత్రాంగం వీటిని ఉపయోగించకపోవడంతో కొన్ని యంత్రాలకు తుప్పు పట్టింది. ఉన్నతాధికారులు స్పందించి వాటిని వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.