‘అమెరికా కన్ను ఆ దేశాలపై పడింది’
లాటిన్ అమెరికా దేశాలను ఆక్రమించుకోవాలని US చూస్తోందని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆరోపించారు. వెనిజులా నౌకను అమెరికా సీజ్ చేసిన నేపథ్యంలో 'ఎక్స్' వేదికగా మండిపడ్డారు. 'శత్రువుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకుని నిలబడటమే నిజమైన ప్రతిఘటన' అని ఆయన పేర్కొన్నారు. అగ్రరాజ్యం ఆధిపత్య ధోరణిని ఖమేనీ తీవ్రంగా తప్పుబట్టారు.