నెల్లికుదురులో కాంగ్రెస్ సీనియర్ నేతల అసంతృప్తి
MHBD: కాంగ్రెస్ పార్టీ కోసం తాము కష్టపడ్డామని, కావాలనే ఓ వర్గం పదవులు రాకుండా అడ్డుపడుతున్నారని నెల్లికుదురు మండలానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు రహస్య భేటీ నిర్వహించి, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ భూక్య ఉమా మురళి నాయక్ అసంతృప్తి నేతలను జిల్లా కేంద్రానికి రావాలని పిలిచినట్లు సమాచారం.