VIDEO: కసాపురం ఆంజనేయ స్వామికి ప్రాకారోత్సవం
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ, ఆకు పూజ, సింధూర, స్వర్ణ వజ్రకవచలంకరణ చేశారు. రాత్రి స్వామివారిని ఉత్సవమూర్తికి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో కొలువు తీర్చి ఆలయ ఆవరణలో ప్రాకారోత్సవం నిర్వహించారు.