నెల్లుట్లలో రోడ్ సేఫ్టీపై అవగాహన సదస్సు
JN: లింగాల గణపురం(M) నెల్లుట్లలో రోడ్ సేఫ్టీపై అవగాహన సదస్సును నిర్వహించారు. జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సదస్సుకు హాజరై మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నరసింగ రామకృష్ణ, తదితరులు ఉన్నారు.