వీపీఆర్‌ దంపతులను కలిసిన జడ్పీ సీఈవో

వీపీఆర్‌ దంపతులను కలిసిన జడ్పీ సీఈవో

NLR: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులను నూతన జడ్పీ సీఈవో శ్రీధర్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆయనను జిల్లా పరిషత్‌కు కొత్త సీఈవోగా ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో సోమవారం నగరంలోని వీపీఆర్‌ నివాసానికి వచ్చిన ఆయన.. ఆ దంపతులకు పూల మొక్కలు అందజేశారు.