LPG లభ్యతపై వదంతులు నమ్మొద్దు: మోదీ
LPG లభ్యతపై వచ్చే వదంతులను నమ్మొద్దని ప్రధాని మోదీ ప్రజలకు సూచించారు. ఎవరూ ఆందోళన చెందాల్సి పని లేదని తెలిపారు. కేవలం ధ్రువీకరించిన సమాచారాన్నే పరిగణనలోకి తీసుకోవాలని వెల్లడించారు. పశ్చిమాసియా వివాదం మొత్తం ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థనే ప్రభావితం చేసిందని చెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశ ప్రయోజనాలను కాపాడతామని హామీ ఇచ్చారు.