19న కుప్పంలో పర్యటించనున్న భువనేశ్వరి
CTR: CM చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈ నెల 19 నుంచి నాలుగు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా డీకేపల్లి చెరువులో జలహారతి నిర్వహిస్తారు. అలాగే నియోజకవర్గంలోని నాలుగు మండలాల ప్రజలు, కార్యకర్తలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం ఎన్నికల తర్వాత దత్తత తీసుకున్న పైపాల్యం, కంచి, బందార్లపల్లి గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను సమీక్షిస్తారు.