రేపు జిల్లాకు తమ్మినేని వీరభద్రం రాక
GDWL: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రేపు గద్వాల పర్యటనకు రానున్నారు. పట్టణంలోని వాల్మీకి భవనంలో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న జిల్లా స్థాయి విస్తృత సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు జె. వెంకటేశ్ కూడా హాజరవుతారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఈ సమావేశానికి భారీగా తరలిరావాలని జిల్లా కార్యదర్శి కె. వెంకటస్వామి పిలుపునిచ్చారు.