బంగారు కాయిన్ల పేరుతో రూ.20.50 లక్షల మోసం

బంగారు కాయిన్ల పేరుతో రూ.20.50 లక్షల మోసం

కృష్ణా: నరసరావుపేటకు చెందిన తిరుపతిరెడ్డిని బిల్లు లేని బంగారు కాయిన్లు తక్కువ ధరకే ఇస్తామని మోసగాళ్లు నమ్మించారు. 17 బంగారు కాయిన్లు ఉన్నాయని చెప్పి గంగూరు డీ మార్ట్ వద్దకు పిలిపించారు. తిరుపతిరెడ్డి తన బంధువులతో కలిసి రూ.20.50 లక్షల నగదు తీసుకెళ్లాడు. అక్కడికి వచ్చిన వ్యక్తి డబ్బుల బ్యాగ్‌ను కారులో పెట్టించుకుని బంగారం ఇస్తామని చెప్పి పరారయ్యాడు.