అన్న క్యాంటీన్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు
ఏలూరు జిల్లాలో అన్న క్యాంటీన్లను కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాల మేరకు, అధికారులు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెంలో అన్న క్యాంటీన్‌ను RDO రమణ, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ పరిశీలించారు. నిబంధనల ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. ఆహార నాణ్యత, పారిశుద్ధ్యంపై ఆరా తీసి, సిబ్బంది ప్రవర్తన గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు.