'ప్రజలను అంటు వ్యాధుల నుంచి కాపాడండి'

KMM: రోజురోజుకి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ విషజ్వరాలు, అంటువ్యాధులు ప్రబలుతున్నాయని, అధికారులు నిద్ర మత్తు వదిలి ప్రజలను అంటువ్యాధుల నుంచి కాపాడాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ సలాం ఆరోపించారు. మంగళవారం ఖమ్మం 2 టౌన్ పలు ప్రాంతాల్లో సీపీఐ ప్రతినిధి బృందం సందర్శించింది. వాతావరణ మార్పు వల్ల ప్రబలుతున్న అంటూ వ్యాధులను అరికట్టాలని కోరారు.