VIDEO: రాయదుర్గంలో విధులు బహిష్కరించిన లాయర్లు
ATP: రాష్ట్రంలో లాయర్లపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం పట్టణంలో కోర్టు విధులు బహిష్కరించి అడ్వకేట్లు బుధవారం నిరసనలు వ్యక్తం చేశారు. బళ్లారికి చెందిన ఓ లాయర్ కళ్యాణదుర్గంలో వాదనలు వినిపించి, తిరుగు ప్రయాణం అవుతుండగా క్లైంట్లు లాయర్‌పై దాడులకు పాల్పడడం దుర్మార్గమన్నారు. దాడులకు పాల్పడిన వారిని తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు.