నడిరోడ్డుపై పసికందు మృతదేహం..!
W.G: తాడేపల్లిగూడెం మండలం చిన తాడేపల్లిలో నడి రోడ్డుపై మగ శిశువు మృతదేహం లభ్యమైంది. వారం రోజులు వయసున్న శిశువు మృతదేహాన్ని వీఆర్వో ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.