VIDEO: విద్యార్థులతో వినూత్న ప్రదర్శన.. డ్రోన్ విజువల్స్
CTR: పుంగనూరులో వాడ వాడలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే ఓ ప్రైవేటు పాఠశాల వారు వినూత్నంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. సూర్యానగర్ నుంచి బీఎం ఎస్ క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్లబ్ ఆవరణంలో విద్యార్థులతో ఐ లవ్ ఇండియా పాటలు పాడుతూ వెయ్యి అడుగుల మువ్వెనల జాతీయ జెండా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.