ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్‌పై శిక్షణ

NDL: ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్ పై శిక్షణ కార్యక్రమం నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నంద్యాల పట్టణ కేంద్రంలోని రామకృష్ణ పీజీ కళాశాలలోని ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల నుండి పోలీస్ అధికారులు స్టేషన్ రైటర్లు ఈ శిక్షణా తరగతులలో హాజరయ్యారు.