డైట్‌లో సంక్రాంతి సంబరాలు
VSP: భీమిలిలోని జిల్లా విద్య శిక్షణ సంస్థ (డైట్)లో శుక్రవారం భోగిమంట, నృత్యాలు, వేషధారణలతో సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆర్‌జేడీ బి.విజయభాస్కర్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పతంగుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.