మరో సారి చిరుత సంచారం
MDK: జిల్లాలో మరో సారి చిరుత సంచారం కలకలం రేపుతోంది. రేగోడ్ మండలంలోని తిమ్మాపూర్ శివారులో ఇవాళ ఉదయం ఓ లేగ దూడపై దాడి చేసి చిరుత చంపినట్లు గ్రామస్థులు గమనిచారు. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.