VIDEO: మార్కాపురంలో CMRF చెక్కులు పంపిణీ
ప్రకాశం: మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సతీమణి కందుల వసంత లక్ష్మి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. మొత్తం 9 మందికి రూ. 3,58,258ల చెక్కులను అందజేసినట్లు కందుల వసంత లక్ష్మి తెలిపారు.