'భవన నిర్మాణ పనులను వేగవంతం చేయండి'
ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులలో నాణ్యత లోపాలు లేకుండా ప్రభుత్వ నిబంధన ప్రకారం పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కాంట్రాక్టుకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఉష రాణి తదితరులు పాల్గొన్నారు.