పేదలకు నష్టపరిహారం ఇవ్వాలని నిరసన

పేదలకు నష్టపరిహారం ఇవ్వాలని నిరసన

NDL: 167కే జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న పేదలకు నష్టపరిహారం ఇవ్వాలని సీపీఎం జిల్లా నాయకుడు రత్నమయ్య డిమాండ్ చేశారు. గురువారం బండిఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర రైతులతో కలిసి నిరసన తెలిపారు. అయ్యవారి కోడూరులో సర్వేనంబర్ 492/1లో ప్రభుత్వ భూమి సాగు చేసుకుంటున్న పేదలకు నష్టపరిహారం అందించాలన్నారు. 2013 భూ సేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.