కాంగ్రెస్ పాలనలోనే పాలమూరు పచ్చబడ్డది: చిన్నారెడ్డి

MBNR: పాలమూరులో వలసలను నివారించేందుకు సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యం కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమైందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హాయంలో పాలమూరు కోసం చేసింది శూన్యమని విమర్శించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో పచ్చబడ్డ పాలమూరును రాజకీయ లబ్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ ఉపయోగించుకున్నారన్నారు.