VIDEO: 'స్వదేశీని ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైంది'
RR: ఎల్బీనగర్‌లోని చిత్రలేఔట్‌లో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 8 కాలనీల నుంచి దాదాపు 3,000 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. భారతీయ కుటుంబ వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని, దేశం ఆర్థిక ప్రగతి కోసం స్వదేశీని ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పర్యావరణ పరిరక్షణ చేయడంకూడా ప్రధాన ధ్యేయంగా తీసుకోవాలని తెలిపారు.