రేపు తొండూరులో విద్యుత్ అంతరాయం
KDP: తొండూరు మండల పరిధిలోని 33/11కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని తొండూరు ఫీడర్స్ లైన్ షిఫ్టింగ్ పని కారణంగా శుక్రవారం ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ బాల సంజీవులు తెలిపారు. వ్యవసాయ, గృహ వినియోగదారులు, రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.