'భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలి'
విజయనగరం విజ్జి స్టేడియంలో గల ఖేలో ఇండియా బాక్సింగ్ సెంటర్ విద్యార్ధి, విద్యార్ధినులు రాష్ట్రంలో జరిగిన వివిధ బాక్సింగ్ పోటీలలో తమ ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన వారిని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.