లారీ టైర్ల కింద నలిగిన ప్రాణం
NLR: చిన్నచెరుకూరులో రొయ్యల లోడు లారీ వెనుక టైర్ల కింద పడి ఓబిలి వేణు (27) అనే యువకుడు మంగళవారం మృతి చెందాడు. కూలి పనులు చేసుకునే వేణు, చిన్నచెరుకూరు రోడ్డులోని ఓ గోదాము వద్ద నిల్చుని ఉండగా ఈ ఘోరం జరిగింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.