ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి
NRML: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరు మృతి చెందిన ఘటన మూడోలు మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. ఎస్సై బిట్ల పెరిసిస్ వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సయ్యద్ ఖాసీం (54) స్నానం చేయడానికి ఇవాళ ఉదయం చెరువుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడని, మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.