'కోడెలకు వైద్య చికిత్సలు అందించాలి'
SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన గోశాలను ఆలయ ఈవో రమాదేవి సందర్శించారు. గోశాలలో ఉన్న కోడెల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ, అనారోగ్యంతో ఉన్న కోడెలకు వైద్య చికిత్సలు అందించాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పశువైద్యులతో కలిసి కోడెలకు అవసరమైన పరీక్షలు చేయించి, మందులు అందజేశారు.