ఐఆర్‌సీటీసీలో 3 కోట్ల నకిలీ ఖాతాలు
IRCTC పోర్టల్‌లో 3 కోట్లకు పైగా నకిలీ ఖాతాలు ఉన్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైళ్లలో 78% సీట్లు NON AC కేటగిరీలోనే ఉన్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సంలో ఇప్పటివరకు 75 వేల ప్రత్యేక రైళ్లను దేశవ్యాప్తంగా నడిపినట్లు చెప్పారు. ప్రజలకు సౌకర్యవంతమైన, సరసమైన సర్వీసులను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దళారులు రైలు టికెట్లను అమ్మకుండా నిరోధించినట్లు తెలిపారు.