విశాఖలో జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్ పోటీలు
VSP: ప్రతిష్టాత్మకమైన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్ పోటీలు విశాఖ నగరం వేదికగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు ఈ పోటీలకు విశాఖ నగరం ఆతిధ్యం ఇస్తున్నట్లు ఏపి రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అద్యక్షులు జె. సుధాకర రెడ్డి తెలిపారు. శుక్రవారం బీచ్ రోడ్ లోని VMRDA పార్క్ స్కేటింగ్ రింక్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.