'పశువుల సంరక్షణకు జాగ్రత్తలు పాటించాలి'

'పశువుల సంరక్షణకు జాగ్రత్తలు పాటించాలి'

SDPT: పశువుల సంరక్షణకు శాఖాపరమైన అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ కె.హైమావతి అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పశువుల మేత కొరత లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు పశువిజ్ఞాన సదస్సులను నిర్వహించాలని సూచించారు.