ఉప్పల్‌లో చెక్కుల పంపిణీ

HYD: సీఎంఆర్ఎఫ్ పేద, మధ్య తరగతి ప్రజలకు వరంగా మారిందని ఉప్పల్ నియోజకవర్గ ఇంఛార్జి మందుముల పరమేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పలువురు లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎంపీఆర్ అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి అర్హులందరికీ కూడా సీఎంఆర్ఎఫ్ కింద మెడికల్ బిల్లులు సకాలంలో చెల్లిస్తున్నట్టుగా తెలిపారు.