డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పరిశీలన
BHNG: సింగన్నగూడెం వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలను ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, JC భాస్కర రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్లు, డ్రైనేజ్, తాగునీటి సరఫరా, విద్యుత్ వంటి వాటిని పూర్తిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఇళ్ల పంపిణీకి ముందు అన్నిసిద్ధంగా ఉండేలా చూడలన్నారు.