జూనియర్ లెక్చరర్‌కు గ్రూప్-2 ఉద్యోగం
WNP: వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన శ్రీనివాస్-అనురాధ దంపతుల కుమారుడు భరత్ టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్- 2 ఫలితాల్లో ఏసీటీవో ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం కేశంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా ఉన్న భరత్.. గతంలో వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ వంటి ఉద్యోగాలనూ సాధించారు. తండ్రి స్ఫూర్తితోనే ఉద్యోగాలు సాధించినట్లు ఆయన తెలిపారు.