రేషన్ పంపిణీ సక్రమంగా జరగాలి: బీటెక్ రవి

రేషన్ పంపిణీ సక్రమంగా జరగాలి: బీటెక్ రవి

కడప: పులివెందులలో రేషన్ బియ్యం పంపిణీ సక్రమంగా జరగడం లేదని, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి డీలర్ల దృష్టికి తీసుకొచ్చారు. శనివారం టీడీపీ కార్యాలయంలో డీలర్ల సమావేశం జరిగింది. ఇకపై ఇలాంటి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ మధ్య ఏ జాప్యం లేకుండా సరుకులు పంపిణీ జరగాలని ఆదేశించారు.