మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ వినతి
BHNG: మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి 45 రోజులు గడిచాయని వెంటనే మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ BRS భువనగిరి పట్టణ పార్టీ ఆధ్వర్యంలో BRS పార్టీ కౌన్సిలర్లు కలెక్టరేట్‌లో ఏవో అంజిరెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు ఆయా వార్డుల సమస్యలు కౌన్సిల్‌కు తెలియజేసి పరిష్కరించాల్సి ఉందని, కావున వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.