గంగమ్మ తల్లి కొలుపు మహోత్సవం

గంగమ్మ తల్లి కొలుపు మహోత్సవం

CTR: గూడూరు మున్సిపల్ పరిధిలోని నెల్లటూరు గ్రామంలో వెలిసిన గ్రామశక్తి గంగమ్మ తల్లికి కొలుపు వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం గంగపెట్టెలు, బోనాల వేడుకలు తప్పెట్లు మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. వేడుకల్లో గొల్లలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.