VIDEO: ఈనెల 11న సినీ గేయ రచయిత జిల్లాకు రాక

SKLM: శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో ఈనెల 11వ తేదీన 'శ్రీ శూద్రగంగ కావ్యగాన సభ' నిర్వహిస్తున్నట్లు సాహితీ స్రవంతి, సాహితి ప్రతినిధులు కేతవరపు శ్రీనివాస్, అట్టాడ అప్పలనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఈ నెల 11న సాయంత్రం 6 గంటలకు రచయిత సుద్దాల అశోక్ తేజ హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా సాహితీవేత్తలు, కళాభిమానులు, జిల్లా ప్రజలు జయప్రదం చేయాలని కోరారు.