పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
AKP: రాయవరం పోలీస్ స్టేషన్ ను ఎస్పీ తుహీన్ సిన్హా మంగళవారం వార్షిక తనిఖీలు నిర్వహించారు.రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు.పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపాలని ఆదేశించారు.పాత నేరస్తులపై నిరంతరం నిఘా కొనసాగించాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కల్పించాలన్నారు.