తాడిపత్రి ప్రాంతీయ ఆసుపత్రిలో అంధకారం

తాడిపత్రి ప్రాంతీయ ఆసుపత్రిలో అంధకారం

ATP: తాడిపత్రిలోని ప్రాంతీయ వైద్యశాలలో తరచూ అంధకారం నెలకొంటోంది. నిన్న సాయంత్రం వీచిన భారీ ఈదురుగాలులతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఆసుపత్రిలో జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు ఇబ్బందులు పడ్డారు. వైద్యులు తమ స్మార్ట్ ఫోన్ లైట్లను ఆన్ చేసుకుని సేవలు అందించారు. జనరేటర్ ఏర్పాటు చేయాలని రోగులు అధికారులను కోరుతున్నారు.