'చేనేత రంగం బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం'
GNTR: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సోమవారం చేనేత, జౌళి శాఖ అధికారులతో మంత్రి సవిత సమీక్షా సమావేశం నిర్వహించారు. చేనేత రంగం బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఆప్కో ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న రెండు నెలల జీతాల బకాయిలను వెంటనే చెల్లించాలని, అలాగే చేనేత సహకార సంఘాలకు మిగిలిన 30 శాతం బకాయిలను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.