కత్తితో దాడి చేసిన వ్యక్తి అరెస్టు

కత్తితో దాడి చేసిన వ్యక్తి అరెస్టు

AKP: పాయకరావుపేట మండలం మాసాహెబ్‌లో ఇంటి దారి విషయమై కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ అప్పన్న తెలిపారు. గ్రామానికి చెందిన బంటుమల్లి అయ్యారావు, టి సత్యనారాయణ గొడవపడ్డారు. దీంతో అయ్యారావుపై సత్యనారాయణ కత్తితో దాడి చేసి పరారయ్యాడు. శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసి ఎలమంచిలి కోర్టులో హాజరుపరచగా, 14 రోజులు రిమాండ్ విధించింది.